
'కేర్ ఆఫ్ కాంచరపాలెం' నిర్మాత విజయ ప్రవీణ పరుచురి, భారతదేశపు అతిపెద్ద చిత్రం 'బాహుబలి' నిర్మాతలు కలిసి "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య" సినిమాతో తిరిగి వస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సత్య దేవ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం యొక్క టీజర్ ను మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. టీజర్ ఫీల్ గుడ్ విజువల్స్ తో నిండి ఉంది. కథ ఇంకా బయటపడకపోయినా, ఈ చిత్రంలోని మధురమైన భావాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రధాన పాత్ర పోషించిన సత్య దేవ్ అద్భుతమైన నటన కనబరిచినట్లు తెలుస్తోంది. శ్యామ్ పుష్కరన్ కథను అందించారు మరియు బిజిబాల్ సంగీత దర్శకుడు. ఏప్రిల్ 17న తెరపైకి రానున్న 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' ను విజయ ప్రవీణ పరుచురి, శోబు యర్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.