
ఆర్టీసీ సమ్మెపై జేఏసీను తప్పుబడుతున్న సంఘాలు
సుమారు 47రోజులుగా తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించాలంటూ, లాఠీ ఛార్జిలను తట్టుకొని, ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదనుకోని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం విదితమే. అయితే తాజాగా ఆర్టీసీ సమ్మెపై జేఏసీ చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు, వ్యతిరేకతలు వినపడుతున్నాయి. ప్రభుత్వం ఎటువంటి షరతులు పెట్టకుండా ఉంటే కార్మికులు విధుల్లో చేరుతారాని ప్రకటించారు. ఇది విన్న నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రూ.400 కోట్ల నష్టాన్ని పక్కన పెట్టి సమ్మె విరమించడం కార్మికుల కోణంలో న్యాయ సమ్మతం కాదని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికులు 47రోజులుగా చేస్తున్న సమ్మెను గాలికొదిలేసి.. కార్మికులను నట్టేట ముంచారని జేఏసీ నాయకులపై ఎన్ఎంయూ నాయకులు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం నుంచి డిమాండ్లపై ఉలుకూపలుకు లేదు...ఇలాంటప్పుడు సమ్మె విరమించడం సమంజసం కాదని తెలిపారు.