
కొన్ని ఊహాగానాలు నిజమైనప్పుడు ఎక్కడలేని ఆనందం ఉంటుంది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అదే స్టేజ్ లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ప్రభాస్ బాలీవుడ్ ప్రముఖ సంస్థతో సినిమా చేయనున్నాడని, రాముడి గెటప్ లో కనిపిస్తాడని పుకార్లు జోరుగా వినిపించాయి. అయితే ఆ పుకార్లు కొంతవరకు నిజమయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలో ఏకైక పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ టి సిరీస్ తో కలిసి పిరియాడిక్ సినిమా చేస్తున్నట్లు కొద్దీసేపటి క్రితం ప్రకటించాడు. అది కూడా మన దేశపు ఇతిహాసం నుంచి అనుసరించి తెరకెక్కనుంది. ఈ సినిమాకు 'ఆదిపురుషు' అనే టైటిల్ ను ప్రకటించారు. టైటిల్ తో పాటు రిలీజ్ చేయబడిన ఈ పోస్టర్ లో ఏ అనే అక్షరం ఉంది. ఈ చిత్రం శ్రీమహావిష్ణు మొట్టమొదటి అవతారం అయిన 'ఆదిపురుషుడు' ఆధారంగా తెరకెక్కనుంది అంతేకాదు మొదటిసారి ప్రభాస్ నటించే 3D చిత్రం ఇది. మొత్తం 5 భాషల్లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రభాస్ చేతిలో ఇది మరియు ఇప్పటికే ప్రకటించిన నాగ్ అశ్విన్ సినిమా...మొత్తంగా మూడు-నాలుగేళ్ళకు సరిపడా రెండు బడా ప్రాజెక్ట్లు ఉండగా, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తో మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ప్రభాస్ ఇకపై దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలతో సినిమాలు చేసే అవకాశాలు తక్కువే!