
ఈ మధ్యకాలంలో డిజిటల్ హావ పెరిగిపోయింది. ఓటిటిలు పుట్టుకొస్తున్నాయి, కొత్త కొత్త వెబ్ సిరీస్లు వస్తున్నాయి. అందుకే సినీ తారలు కూడా వెబ్ సిరీస్ ను ప్రొడ్యూస్ చేయటమో లేదా అందులో నటించడమే చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి కారణంగా చాలామంది ఓటిటి వైపు మొగ్గు చూపుతున్నారు. కొన్ని నెలల క్రితం అల్లు అరవింద్ ఓటిటి సంస్థను ప్రారంభిస్తే ఇప్పుడు తాజాగా పెద్ద నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ వెబ్ సిరీస్ ను ప్రొడ్యూస్ చేసేందుకు సిద్దమవుతుంది. ఈ వెబ్ సిరీస్ కొరకు యూవీ క్రియేషన్స్ డైరెక్టర్మే ర్లపాక గాంధీతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో పేపర్ బాయ్ ఫెమ్ సంతోష్, ఓ పిట్టా కధ ఫెమ్ సంజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.