
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఇకపై చేయనని రాజకీయాలకు వెళ్లి మళ్ళీ తిరిగి సినిమాల్లోకి 'వకీల్ సాబ్' తో రీఎంట్రీ ఇస్తున్నారు. అది మొదలుపెట్టారో లేదో కరోనా వచ్చి అంతా ఎక్కడిదక్కడ ఆగిపోయింది. అయితే పవన్ ఈ గ్యాప్ ల్లో సినిమాలు మీద సినిమాలు సైన్ చేసి ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ అన్నిటికన్నా మొదట స్టార్ట్ చేసింది మాత్రం ఇంకా రిలీజ్ డేట్ చెప్పట్లేదేంటని అనుకుంటున్న తరుణంలో నేడు అప్డేట్ ఇచ్చారు. దిల్ రాజు నిర్మిస్తున్న బాలీవుడ్ హిట్ మూవీ రీమేక్ 'వకీల్ సాబ్' సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వార్తతో అభిమానుల ఆనందం అవధులు దాటింది. తెలుగు నేటివిటీతో పాటు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు అనుగుణంగా వకీల్ సాబ్ సినిమాలో భారీ మార్పులు చేర్పులు చేసి కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కించారు.