
సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ సినిమా తెరకెక్కించిన దర్శకుడు వంశీ పైడిపల్లి పెద్ద హిట్ కొట్టారు. అయితే మహర్షి తర్వాత వంశీ ఏ సినిమాను ప్రకటించలేదు. ఒక అగ్ర నటుడితో తన తదుపరి ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తెచ్చేందుకు వంశీ పైడిపల్లి చాలా కష్టపడుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ప్రస్తుతం, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మరియు జూనియర్ ఎన్టీఆర్ తమ సొంత ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ స్టార్ హీరోలు తమ సినిమాలు పూర్తి చేయడానికే కనీసం ఆరు నుండి ఎనిమిది నెలల సమయం పడుతుంది. అయితే సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం వంశీ పైడిపల్లి రామ్ చరణ్‌తో జతకట్టాలని ప్రయత్నిస్తున్నాడట. ఈమేరకు చరణ్ కు వంశీ కథ చెప్పగా బాగా ఇంప్రెస్ అయినట్లు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు కార్యాచరణ దాల్చుతుందో చూడాలి.