
స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం' గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఆ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబులు ఎంత ఫెమసో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఆ సీరియల్ మొదలైనప్పటి నుంచి రేటింగ్స్ పరంగా దూసుకుపోతుంది. తాజాగా విడుదలైన 42వ వారం రేటింగ్స్ లో కూడా వంటలక్కనే టాప్ లో ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ కూడా వంటలక్క ముందు నిలబడలేకపోయింది. ఇంకా చెప్పాలంటే మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న బిగ్ బాస్ కనీసం టాప్ 5 లో కూడా లేదు. సంవత్సరంలో ఒకసారి వచ్చి పోయే రియాల్టీ షో కన్నా సంవత్సరం పాటు ఉండే సీరియల్స్ కే ఓటేస్తున్నారు నెటిజన్లు.