
కరోనా వల్లన ఎంతోమంది ఆర్థికంగా, మానసికంగా నష్టపోయారు. జీవనం కొనసాగించలేక అలిసిపోయారు. అయితే మళ్ళీ అంత సర్దుమణుగుతుంది. దీంతో కుర్ర హీరోలు కూడా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. 2020 లో పెళ్లి చేసుకుందాం అనుకుని పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకుంటూ వస్తున్న జంటల్లో బాలీవుడ్ కుర్ర హీరో వరుణ్ ధావన్-నటాషా ఒకరు. ఈ ఇద్దరు చిన్నతనం నుంచి ప్రేమించుకుంటున్నారు. షికార్లు కొడుతూ, సెలెబ్రిటీల పెళ్లిళ్లు, పార్టీలు అటెండ్ అవుతూ మీడియా కంటపడుతూనే ఉంటారు. అయితే వీరు పెద్ద హడావిడి లేకుండా కేవలం కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య నిన్న మూడుముళ్ల తో ఒకటయ్యారు. తన ప్రేయసిని పెళ్లాడిన వెంటనే ఎంతో ఆనందంగా ధావన్ వివాహ వేడుకల నుండి ఫోటోల్ని షేర్ చేశారు. ``లైఫ్ లాంగ్ లవ్.. ఇప్పుడే అధికారికమైంది`` అంటూ హార్ట్ ఈమోజీని అతడు జోడించారు.