
సైరా నరసింహరెడ్డి తరువాత, సురేందర్ రెడ్డి తదుపరి సినిమా సంబంధించి అధికారిక ప్రకటన చేయలేదు. అతని తదుపరి చిత్రం ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు సురేందర్ రెడ్డి మెగాను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడని తెలుస్తోంది. ప్రిన్స్ వరుణ్ తేజ్ తో తన నెక్స్ట్ సినిమా ఉండబోతుందని సమాచారం. కథ నచ్చడంతో వరుణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అతి త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. తాజా సమాచారం మేరకు ఈ కథను ముందుగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు చెప్పడం జరిగిందట. కానీ ప్రభాస్, ఇది పాన్ ఇండియా లెవల్ సినిమా కాదని భావించడంతో తిరస్కరించారు. అప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ కు యాక్షన్ థ్రిల్లర్ అయిన కథను వినిపించగా..అతని పాత్ర, కధ నచ్చడంతో వెంటనే సై అన్నాడు. భిన్నమైన కధలను ఎంచుకునే వరుణ్ సురేందర్ రెడ్డి కథను ఓకే చేశాడంటే, ఇందులో కూడా కొత్తదనం ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు.