
మెగా కాంపౌండ్ నుంచి హీరో వరుణ్ తేజ్ ఎప్పటికప్పుడు భిన్నమైన కధలను ఎంచుకుంటూ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. కేవలం కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోకుండా కథకు ప్రాముఖ్యత ఇస్తూ కొత్తదనం కోసం ప్రయత్నించే హీరోల్లో వరుణ్ తేజ్ ముందు వరుసలో ఉంటాడు. అయితే బాక్సింగ్ నేపధ్యంలో వరుణ్ హీరోగా తెరకెక్కుతున్న 'గని' సినిమా జులై 30న విడుదల అవుతుండగా... వెంకటేష్, వరుణ్ లు హీరోగా తెరకెక్కిన F2 కు సిక్వెల్ గా వస్తున్న F3 షూటింగ్ మొదలయింది. ఈ చిత్రం ఆగష్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే వీటి తర్వాత కొంత గ్యాప్ తీసుకొని దర్శకడు ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికి సినిమా లాక్ అయింది కానీ కథ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదని తెలుస్తుంది. మొత్తానికి వరుణ్ గట్టి ప్లానింగ్ తో బరిలోకి దిగుతున్నాడు.
Tags: #Cinecolorz #Tollywood #VarunTej