
పెదనాన్ననే పక్కకు నెట్టేసిన వరుణ్ తేజ్ ?
నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, పెదనాన్న చిరంజీవినే పక్కకు నెట్టేసాడు. అర్థం కాలేదా ? అసలు మ్యాటర్ ఏంటంటే.... రామ్ చరణ్ నిర్మాతగా సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తాజాగా వచ్చిన చిత్రం "సైరా నరసింహ రెడ్డి". ఈ చిత్రం వసూళ్లు ఓవరాల్ గా చూసుకుంటే నిరాశే మిగిల్చిందని తెలుస్తోంది. రెండు మూడు ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల నష్టాలు తప్పలేదు. ఓవర్సీస్ లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేవలం 2.5 మిలియన్ మార్క్ దగ్గరే ఆగిపోయింది. మొత్తంగా రూ.240 కోట్ల గ్రాస్.. రూ. 143 కోట్లు షేర్ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది సైరా. అయితే 33కేంద్రాల్లో 50రోజులు పూర్తి చేసుకోని 2019విడుదలైన చిత్రాల్లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. మహేష్ బాబు నటించిన మహర్షి 110 సెంటర్లతో మొదటి స్థానంలో ఉండగా.... వరుణ్ తేజ్, వెంకటేష్ నటించిన ఎఫ్2 65 సెంటర్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ విధంగా చూస్తే చిరంజీవి సినిమా కంటే వరుణ్ తేజ్ సినిమానే ముందు స్థానంలో ఉంది మరి.