
మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి ఉదయ్ పూర్ విలాస్ లో గ్రాండ్ గా మెగా కుటుంబ సభ్యుల నడుమ జరిగింది. మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన నిహారిక పెళ్ళికి సంబంధించిన ఫొటోలే కనపడుతున్నాయి. ఇకపోతే ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తుంది. నిహారిక పెళ్లికి వరుణ్ తేజ్ కు కాబోయే భార్య వచ్చిందని వార్తకోస్తున్నాయి. ఆమె మరెవరో కాదు ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వరుణ్ తేజ్ తో కలిసి నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారని అందుకే అంతమంది ప్రముఖ హీరోయిన్లు ఉన్న లావణ్యను మాత్రం స్పెషల్ గా పిలిచారని పుకార్లు వినిపిస్తున్నాయి. లావణ్య, రైతు వర్మ తప్పితే మరే హీరోయిన్ నిహారిక పెళ్లికి రాలేదు. దీంతో వరుణ్ తేజ్ తో కలిసి లావణ్య రెండు సినిమాల్లో కూడా నటించడంతో వరుణ్ లావణ్య మధ్య ప్రేమాయణం నడుస్తుందని టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో వారి నోటి నుంచే తెలియాలి.