వరుణ్ తేజ్ పారితోషకం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…అందరిని పక్కకు నెట్టేసాడుగా
4 years ago

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ మొదటి నుంచి తన సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు వహిస్తూ వస్తున్నాడు. మొదట కొంచెం డల్ అయిన వరుణ్ తర్వాత ఫిదా సినిమాతో పుంజుకుని వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్నాడు. తొలిప్రేమ, ఎఫ్ 2లు కూడా బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్లను సాధించాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తాజాగా వచ్చిన గద్దలకొండ గణేష్ కూడా మంచి విజయాన్ని సాధించింది. దీంతో వరుణ్ మార్కెట్ లెక్కలు మారాయి. కెరీర్ మొదటి నుంచి మార్కెట్ లెక్కలకు అనుగుణంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు మార్కెట్ పెరగడంతో సినిమాకు రూ.3 నుంచి 4 కోట్లు తీసుకునే వరుణ్ ఏకంగా రూ.8 నుంచి 10 కోట్లు తీసుకుంటున్నాడట. నిర్మాతలు కూడా వరుణ్ తో సినిమా తీస్తే సేఫ్ జోన్లో ఉండొచ్చని భావించి అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట.