
దగ్గుబాటి వెంకటేష్ నటించిన తాజా చిత్రం 'ఎఫ్2' బాక్స్ ఆఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. అందులో వెంకటేష్ చేసిన కామెడీ చూసి వెంకీ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం మేనల్లుడు నాగచైతన్యతో కలిసి "వెంకీ మామ" చిత్రంలో నటిస్తున్నాడు. రియల్ లైఫ్ మామ అల్లుడు రీల్లో కూడా అదే పాత్రల్లో కనిపించనుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే వెంకటేష్ తదుపరి సినిమాగా తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన "అసురన్" రీమేక్‌లో నటించనున్నాడు. దీనికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తారని సమాచారం. అయితే ఇందులో సీనియర్ నటి శ్రీయాను హీరోయిన్ గా ఎంపిక చేసుకొనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టిన ఈ సినిమాను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.