
మహేష్ బాబు , రష్మీక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా భారీ అంచనాల నడుమ జనవరి 11న రిలీజ్ అయింది. మహేష్ అన్నట్లుగా సరిలేరు నీకెవ్వరు 'బొమ్మ దద్దరిలిపోయింది'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజులకే రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీన్నిబట్టి చూస్తుంటే సినిమా కమేర్షియల్ గా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా హిట్ అయిందని ఉరుకోకుండా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తూ మరింత క్రేజ్ పెంచుతుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు, అనిల్ రావిపూడి పాల్గొంటున్న ఓ షోకు వెంకటేష్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. F2తో వెంకీ, అనిల్ రావిపూడికి మంచి సాన్నిహిత్యం ఉంది. సితమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాతో మహేష్ కు వెంకీకు మంచి అనుబంధం ఉంది. అందుకనే సినిమాపై హైప్ పెంచేందుకు వెంకటేష్ హోస్ట్ గా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.