
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన తరుణ్ భాస్కర్ మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. యూత్ ను ఆకట్టుకునే విధంగా డైలాగ్స్, కధను పొందుపరుస్తూ ఫ్రెష్ కాన్సెప్ట్ తో తన సత్తా చాటాడు తరుణ్ భాస్కర్. ప్రస్తుతం మంచు వారి వారసురాలు మంచు లక్ష్మితో ఒక వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. తరుణ్ దర్శకత్వం వహిస్తున్న వెబ్ సిరీస్ పొలిటికల్ డ్రామా నేపద్యంలో సాగుతుందని తెలుస్తోంది. అందులో మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వెబ్ సిరీస్ త్వరలో నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, వెబ్ సిరీస్ ప్రసారం అవ్వటంతోనే తన తదుపరి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. దగ్గుబాటి వెంకటేష్ హీరోగా హైదరాబాద్ రేస్ కల్బ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కధ అని తెలుస్తోంది. ఇందులో వెంకీ హైదరాబాద్ స్లాంగ్ లో చెప్పే డైలాగ్లు ఆకట్టుకుంటాయని సమాచారం. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.