
ప్రపంచాన్ని కనిపించని ఒక వైరస్ గడగడలాడిస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది అందరి సర్దాను తీర్చేస్తుంది. మహామహులు సైతం దీని భారిన పడుతున్నారు. అందుకే కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు షూటింగ్లకు అనుమతి ఇచ్చినప్పటికీ పాల్గొనడానికి వెనకడుగు వేస్తున్నారు. మరి ముఖ్యంగా సీనియర్ హీరోలు. ఇంత విధృతంగా కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో రిస్క్ చేయటం సరైనది కాదని ఆలోచిస్తున్నారు. అందుకే సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ మొదట ఈ ఏడాది చివర షూటింగ్లకు వెళ్ఢాం అనుకున్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి దృశ్య వచ్చే ఏడాది సంక్రాంతి వరకు షూటింగ్లకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారట. ఒకందుకు ఇది మంచి నిర్ణయమనే చెప్పాలి.