
సెలెబ్రిటీలు ఇద్దరు చేతులు పట్టుకొని రోడ్ మీద రెండు మూడు సార్లు కనిపిస్తే చాలు వీళ్ల మధ్య ఏదో నడుస్తుందని మరుసటి రోజు ఫ్రెంట్ పేజ్ లో వస్తుంది. అలాంటి రూమర్లు ఎప్పటి నుంచో ఉన్న స్టార్ హీరో , హీరోయిన్లు ఆ వార్తలను ఇంకా బలపరుస్తూ మరోసారి దర్శనమిచ్చారు. ఇంతకీ వాళ్లు విక్కి కౌశల్, కత్రినా కైఫ్. ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడు వాటిని ఇంకా బలపరుస్తూ ఆగస్టు రాత్రి 9 గంటలకు విక్కీ కౌశల్ నెత్తికి టోపి, మొహానికి మాస్క్ పెట్టుకొని ఫుల్ పకడ్బందీగా కత్రినా కైఫ్ ఇంటి దగ్గర ల్యాండ్ అయ్యి..కారు దిగిదిగగానే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. మరి ఇంతకీ వీరి మధ్యలో ఎం నడుస్తుందని విషయంలో ఎప్పటికి క్లారిటీ వస్తుందో!