
కేవలం రెండు మూడు సినిమాలతో క్రేజ్, స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. సెన్సేషనల్ స్టార్ గా మారి అమ్మాయిల హృదయాలను కొల్లగొడుతున్నాడు. ఇప్పుడు కేవలం సౌతే కాదు బీ టౌన్‌కు సైతం విజయ్ దేవరకొండ అంటే ఎవరో తెలుసు. ఇదిలావుంటే విజయ్ దేవరకొండ ఫిల్మ్ నగర్లో ఒక ఇల్లు కొన్నాడు. కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రులతో ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు. గృహప్రవేశం సింపుల్ గా అయినప్పటికీ తన స్నేహితులకు మాత్రం గ్రాండ్ గా పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ కొనుక్కున్న ఇంటి గురించే సినీ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. విజయ్ ఆ ఇంటి కోసం సుమారు రూ. 20 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. అన్ని హంగులతో, విలాసవంతమైన భవనాన్ని నిర్మించాడట. విజయ్ దేవరకొండ తన మార్కెట్ ప్రకారం ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు తీసుకుంటున్నాడు. ఆ లెక్కన చూసుకుంటే విజయ్ కు ఇది పెద్ద విషయమేమీ కాదనే చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం "వరల్డ్ ఫెమస్ లవర్" అనే చిత్రంలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.