
యూట్యూబ్ వీడియోస్ తో అలరించిన పలువురు నటి నటులు అలానే దర్శకుడు కలిసి వెండితెర కోసం తెరకెక్కించిన సినిమా 'కలర్ ఫోటో'. కరోనా పుణ్యమాని తాజాగా ఓటిటిలో విడుదలైంది. సందీప్ రాజ్ దర్శకత్వంలో సుహాస్, చాందిని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులనే కాక సినీ క్రిటిక్స్ మరియు టాలీవుడ్ సెలెబ్రెటీలను సైతం ఆకట్టుకుంటుంది. ఒకరి తర్వాత ఒకరు ఈ చిత్రంపై తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రష్మిక, సాయి ధరమ్ తేజ్, నిహారిక వంటి వారు సినిమాపై ప్రశంసలు కురిపించగా తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమా కచ్చితంగా అందరూ చూడాలని ప్రతి ఒక్క పాత్రను దర్శకుడు చూపించిన విధానం చాల బాగుందని నటి నటులు యాక్టింగ్ అదరకొట్టారని సోషల్ మీడియా వేదికగ చెప్పారు. మరి ఈ ఎమోషనల్ కలర్ఫుల్ రైడ్ ను మీరు ఇప్పటి వరకు చూడనట్లయితే ఆహా యాప్ లో చూసేయండి.