
అక్కినేని వారి కోడలు సమంత అనంత బిజీగా మరే హీరోయిన్ లేదేమో. సినిమాల్లో కాదు యాడ్లు, వెబ్ సిరీస్, ఈవెంట్ లు అంటూ ఫుల్ జోష్ లో ఉంది. ఒక రకంగా ఇది సామ్ సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చేమో. పిల్లలు అనుకున్నప్పటి నుంచి ఇక అన్నిటికి దూరంగా ఉంటానని ఎప్పుడో చెప్పింది. దీంతో ఫామ్ లో ఉన్నన్ని రోజులు దాన్ని క్యాష్ చేసుకుంటుంది. తాజాగా ఆహా ఓటిటీలో సమంత హోస్ట్ గా 'సామ్ జామ్' అనే టాక్ షోను ప్రకటించారు. నవంబర్ 13 నుంచి ఆహా యాప్ లో ప్రసారంకానుంది. అయితే ఈ టాక్ షోకు మొదటి గెస్ట్ గా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ వచ్చినట్లు తెలుస్తుంది. మామూలుగానే ఈ ఇద్దరు ఎంతో చలాకీగా ఉంటారు అలాంటిది ఇద్దరు ఒకే స్టేజ్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందో?