
ఈ మధ్య కాలంలో మన దర్శక నిర్మాతల పంథా కాస్త మార్చారు. టైటిల్స్ క్యాచీగా పెడుతూ జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తీస్తున్న సినిమాలన్నీ దాదాపు పాన్ ఇండియా సినిమాలు కావడంతో దర్శక నిర్మాతలు మంచి టైటిల్స్ పై దృష్టి పెట్టారు. ఇక ఈ రోజు పూరీ జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. లైగర్ అనే టైటిల్ పెట్టి దానికి సాలా క్రాస్ బ్రీడ్ అనే సబ్ టైటిల్ ఇచ్చారు. టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో పాటు పోస్టర్లో విజయ్ దేవరకొండ లైగర్లా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. లయన్ లాంటి ధర్మ ప్రొడక్షన్ సంస్థ, టైగర్ లాంటి పూరీ కనెక్ట్స్ కలిసి లైగర్ సినిమా చేస్తుండగా, లైగర్ అంటే ఏంటో తెలుసుకునేందుకు జనాలు గూగుల్ బాట పట్టారు. అయితే క్రాస్ బ్రీడ్ని లైగర్ అంటాం. మగ సింహం, ఆడ పులికి పుట్టిన సంతానాన్ని లైగర్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ పేరుని విజయ్ దేవరకొండ సినిమాకు పెట్టడం ఆసక్తిని కలిగిస్తుంది.