
రెండో సినిమాతోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ నటించిన "అర్జున్ రెడ్డి" ఏ రేంజ్ లో ఆడిందో వేరే చెప్పాల్సిన పని లేదు. అర్జున్ పాత్రకు ప్రాణం పోసి అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టాడు. యూత్ ఐకాన్ గా మారాడు. ఆ సినిమా నుండి సెన్సేషనల్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన "గీత గోవిందం" కూడా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరి ఉన్న క్రేజ్ ను మరింత పెంచింది. ఆమధ్యలో "నోటా" ప్లాప్ కాగా, "టాక్సివాల" మళ్ళీ హిట్ ఇచ్చింది. తాజాగా వచ్చిన "డియర్ కామ్రేడ్" బాక్స్ ఆఫీసు దగ్గర ఫెయిల్ అయినప్పటికీ ఒక వర్గ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం "వరల్డ్ ఫెమస్ లవర్" అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలావుంటే విజయ్ దేవరకొండ ఫిల్మ్ నగర్లో ఒక ఇల్లు కొన్నాడు. కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రులతో ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు. గృహప్రవేశం సింపుల్ గా అయినప్పటికీ తన స్నేహితులకు మాత్రం గ్రాండ్ గా పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది.