
ఒక్క సినిమాతో సెన్సేషన్ల్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. విజయ్ నటించిన తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్' అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో తన తదుపరి చిత్రాల విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తున్నాడు. డియర్ కామ్రేడ్ ముందు వరకు బడా బ్యానర్ అయితే చాలు అనుకున్న విజయ్ ఇప్పుడు మాత్రం కథ, కథనం బాగుంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అయితే తాజాగా ఫన్, చిన్నపాటి ఎమోషన్ల ఎన్నారై క్యారెక్టర్ లో నటించేందుకు సై అన్నాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా ? యూత్ కి బాగా నచ్చిన సినిమా 'హుషారు' డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి. హుషారు మంచి విజయాన్ని సాధించడంతో అతనితో సినిమా చేసేందుకు యంగ్ హీరోలు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండకు లైన్ చెప్పగా...నచ్చి వెంటనే ఓకే చేశాడట. ఇక ప్రస్తుతం విజయ్ నటించిన 'వరల్డ్ ఫెమస్ లవర్' అనే చిత్రం రిలీజ్ కు సిద్ధమవుతోంది.