
రాశి ఖన్నా తన మునుపటి సినిమా "వరల్డ్ ఫేమస్ లవర్" అనే రొమాంటిక్ డ్రామాపై చాలా ఆశలు పెట్టుకుంది. దీనిలో ఆమె యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండతో స్క్రీన్ స్పెస్ పంచుకుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఫెయిల్ అయింది. వరల్డ్ ఫేమస్ లవర్ విడుదలకు ముందు, టీజర్లో హాట్ షో కారణంగా రాశి ఖన్నా న్యూస్ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం, విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్‌ను అంగీకరించడం తాను చేసిన తప్పుగా భావిస్తున్నట్లు...మళ్ళీ అలాంటి తప్పును చేయకూడదని రాశి ఖన్నా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా ప్రకారం, విజయ్ దేవరకొండ నటించిన క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన సినిమా ఎంచుకోవడం ఆమె తప్పు. అయితే, ఆమె మాట్లాడుతూ "ఇలాంటి తప్పుల నుంచి మంచి నటిగా మారేందుకు ప్రయత్నిస్తున్నాని" తెలిపింది.