
ఈమధ్యకాలంలో సినిమా నచ్చితే థియేటర్ కు వెళ్లి చూద్దాం లేకపోతే కొన్ని రోజులు ఆగితే ఏ ప్రైమ్ లోనో, హాట్ స్టార్ లోనో వస్తుందిలే అని లైట్ ప్రేక్షకులు తీసుకుంటున్నారు. సూపర్ హిట్ టాక్ వస్తే థియేటర్ ఫీల్ మిస్ అవ్వకూడదని వెళ్తున్నారు. యావరేజ్ టాక్ వస్తే మాత్రం అసలు ఆలోచించకుండా లైట్ తీసుకుంటారు. ఇప్పుడు అదే కుర్ర హీరోలైన సందీప్ కిషన్, విజయ్ దేవరకొండ కొంపముంచుతుంది. తాజాగా సందీప్ కిషన్ హీరోగా నటించిన "తెనాలి రామకృష్ణ బి.ఏ.బి.ఎల్" చిత్రంకు పాజిటివ్ టాక్ వచ్చింది. కామెడీ బాగుందంటూ మంచి రివ్యూలే వచ్చాయి. కానీ ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు వెళ్లి సినిమాను చూడలేదు. దీంతో ఈ చిత్రానికి నష్టాలు తప్పలేదు. ఈ సినిమా అప్పుడే ఓటిటి ప్లాట్ఫార్మ్ లోకి వచ్చేస్తుందని సమాచారం. ఇక మరోవైపు విజయ్ దేవరకొండ నిర్మించిన "మీకు మాత్రమే చెప్తా" పరిస్థితి కూడా ఇదే. రిలీజ్ అయిన వీకెండ్ కాస్త జెనాలు కనిపించినా ఆ తర్వాత మాత్రం అది కంటిన్యూ అవ్వలేదు. కలెక్షన్స్ బాగానే వచ్చిన కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. ఈ చిత్రం కూడా కొన్ని రోజుల్లో హాట్ స్టార్ లో రానుందని సమాచారం.