
బిగ్ బాస్ సీజన్ 4 చివరి వారానికి చేరుకున్న విషయం తెలిసిందే. టాప్ 5 కంటెస్టెంట్లుగా అభిజీత్, అఖిల్, అరియానా, సోహెల్ మరియు హారికలు ఉన్నారు. అయితే వీళ్ళలో ఎవరు విన్నర్ గా ఎవరు రన్నర్ గా నిలుస్తారనే దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈమేరకు తమ ఫెవరెట్ కంటెస్టెంట్లను గెలిపించేందుకు సోషల్ మీడియా ద్వారా ఓట్లు వెయ్యమని ప్రచారం చేస్తున్నారు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కాక ప్రముఖ సెలెబ్రిటీలు కూడా కంటెస్టెంట్లకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా శ్రీకాంత్, నాగబాబు బహాటంగానే అభిజీత్ కు మద్దతు చేప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ కూడా అభిజీత్ కు అల్ ది బెస్ట్ చెబుతూ నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని పోస్ట్ పెట్టాడు . 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా ద్వారా వీరు మంచి స్నేహితులయ్యారు. దీంతో అభిజీత్ కు తన మద్దతు తెలిపాడు. దీని ద్వారా అభిజీత్ విన్నర్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అర్ధం అవుతుంది.