
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాను ప్రకటించారు. అర్జున్ రెడ్డి హీరో, తదుపరి సినిమాకి టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్‌తో జతకట్టారు. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. విజయ్ దేవరకొండకు ఇప్పుడు ఒక హిట్ చాలా అవసరం. అతని చివరి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తో 'ఫైటర్' అనే సినిమాను చేస్తున్నాడు. దీనితో పాటు 'హీరో' అనే సినిమాను చేస్తున్నాడు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ చిత్రం కోసం లెక్కల డైరెక్టర్ సుకుమార్ తో కలిసాడు. సుకుమార్ సినిమాలు ఎంత స్టైలిష్ గా ఉంటాయో తెలిసిందే. మరి వీరి కలయికలో రాబోయే సినిమా పాన్ ఇండియా లెవల్ లో హిట్ అవుతుందో లేదో చూద్దాం. ఈ చిత్రాన్ని ఫాల్కాన్ పిక్చర్స్ బ్యానర్ పై కేదర్ సెలగంశెట్టి నిర్మిస్తున్నారు.