
టాలీవుడ్ సెన్సేషన్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న తరువాత భారీ స్థాయిలో అభిమానులు పెరగడమే కాక విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే అతని చివరి హిట్ 'గీత గోవిందం' తర్వాత విజయ్ గ్రాఫ్ పడిపోయింది. అతని గత రెండు చిత్రాలు 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫెమస్ లవర్' చిత్రాలు బోల్తా పడటంతో ఈసారి మంచి లైన్ అప్ చేసుకున్నాడు. పూరి జగన్నాధ్ తో సినిమా తర్వాత క్లాస్ డైరెక్టర్ శివ నిర్వాణతో ఓ సినిమా చేయనున్నాడు. అందులో విజయ్ ఎన్నడూ చూడని పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వినోదంతో నిండి ఉన్న పాత్రలో రౌడి కనిపించబోతున్నట్లు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. మరి ఇది ఎంత వరకు నిజమో, ఆ పాత్ర విశేషం ఏమిటో మునుముందు చూద్దాం.
Tags: #Rowdyboy #VijayDevarakonda