
టాలీవుడ్ కొత్త సెన్సేషన్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన తరువాత దశ తిరిగింది. 'అర్జున్ రెడ్డి' చిత్రం సినీ క్రిటిక్స్ కు సైతం నచ్చింది. దాని తర్వాత విజయ్ తో సినిమాలు చేయాలని దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టారు. కానీ విజయ్ గ్రాఫ్ 'గీత గోవిందం' సినిమా తర్వాత అమాంతం పడిపోయింది. రౌడీ బాయ్ నటించిన రెండు తాజా చిత్రాలు 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫెమస్ లవర్' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేందుకు మంచి లైన్ అప్ ను సిద్ధం చేసుకున్నాడు. ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో 'ఫైటర్' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇది కాక ప్రేమ కథలతో యూత్ ను ఆకట్టుకున్న డైరెక్టర్ శివ నిర్వాణతో ఒక సినిమా చేయనున్నాడు. అయితే విజయ్ ఇందులో మేజర్ పాత్రలో మిస్టర్ దేవరకొండ కనిపించడమే కాక సెన్సేషనల్ స్టార్ కడుపుబ్బా నవ్వించనున్నాడట. మరి ఇలాంటి కొత్త రోల్ ట్ర్య్ చేస్తున్న విజయ్ కు కూడా బొమ్మ దద్దరిల్లుతుందో లేదో చూద్దాం.