
విజయ్ దేవరకొండ ఏంటి...మహేష్, బన్నీను పక్కన పెట్టడమేంటి ? అనుకుంటున్నారా ? అసలు సంగతి ఏంటంటే...."పెళ్ళి చూపులు" సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత వచ్చిన "అర్జున్ రెడ్డి" సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో ఇమేజ్ ను, క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రత్యేకమైన స్టయిల్, సినిమా ప్రమోషన్స్ తో కుర్రకారును ఆకట్టుకుంటున్నాడు. తను ఎం మాట్లాడిన ఇప్పుడొక సెన్సేషన్. అర్జున్ రెడ్డి తర్వాత చేసిన గీత గోవిందం, టాక్సివాలా, మహానటి అన్ని హిట్ అవ్వడంతో తిరుగులేని మార్కెట్ కూడా సొంతం చేసుకున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న "వరల్డ్ ఫెమస్ లవర్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉంటె ఇంత క్రేజ్ బన విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ప్లాట్ఫారం అయిన ఇన్స్టాగ్రామ్ లో మహేష్, బన్నీను వెనక్కినెట్టేసాడు. విజయ్ దేవవరకొండ.. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 5 మిలియన్ ఫాలోవర్స్ చేరకున్నారు. మహేష్ బాబు ఇన్స్టా ఖాతాను 3.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అల్లు అర్జున్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేవారి సంఖ్య 4.6 మిలియన్లు ఉన్నారు. తాజాగా విజయ్ దేవరకొండ వీళ్లందరినీ క్రాస్ చేయడం విశేషం.