
విజయ్ దేవరకొండ ప్రస్తుతం, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్నికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతలు, ఇప్పటికే వరల్డ్ ఫేమస్ లవర్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేయగా, వాటికి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. కొన్ని రోజుల క్రితం 'మై లవ్' అనే మొదటి పాటను ఆవిష్కరించారు. ఇప్పుడు చిత్ర బృందం రెండవ పాటను రిలీజ్ చేయనుంది. తాజా అప్డేట్ ప్రకారం, విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ లోని 2 వ పాట బొగ్గు గనిలో చిత్రికరించబడింది. జనవరి 29 న సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది. విజయ్ దేవరకొండ స్వయంగా తన ట్విట్టర్లో కొత్త పోస్టర్ను విడుదల చేయడం ద్వారా దీనిని ధృవీకరించారు. పోస్టర్లో కేథరీన్ థెరాసాతో విజయ్ దేవరకొండ బొగ్గులో పడుకొని ఉన్నారు. విజయ్ గత చిత్రం 'డియర్ కామ్రేడ్' ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. వరల్డ్ ఫెమస్ లవర్ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.