
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా చిత్రం "వరల్డ్ ఫెమస్ లవర్". క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కేవలం చివరి షెడ్యూల్ మిగిలి ఉంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య రాజేష్, రాశిఖన్నా, క్యాథరీన్, ఇజబెల్లె కథానాయికలు. ఇకపోతే చెప్పినట్టుగానే చిత్ర బృందం ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ బట్టి ఐశ్వర్య రాజేష్ సువర్ణ లాగా, విజయ్ దేవరకొండ ఆమె భర్త శీనయ్య లాగా కనిపించనున్నారు. అయితే దినిబట్టి చూస్తే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో 4పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. విజయ్ తాజా చిత్రం డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్ అవ్వడంతో ఈ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలనే కసితో ఉన్నాడు. వరల్డ్ ఫెమస్ లవర్ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.