
హ్యాట్రిక్ అల్లు అరవింద్. అర్ధం కాలేదా ?నిర్మాత అల్లు అరవింద్ ను హ్యాట్రిక్ అని ఎందుకు అంటారో నేటి తరం నటులు, నటీమణులకు తెలుసు. మ్యాటర్ ఏంటంటే, ఇండస్ట్రీకి అప్పుడే వచ్చిన కొత్త నటులు, నటిమణులతో, దర్శకులతో మూడు చిత్రాల ఒప్పందం కుదుర్చుకుంటారు అల్లు అరవింద్. అలానే, తమన్నా కెరీర్ మొదలు పెట్టిన సమయంలో ఆమెతో కూడా మూడు సినిమాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదే విదంగా, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో కూడా ఇలాంటి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా విజయ్, అల్లు అరవింద్ నిర్మాణంలో గీతా గోవిందం, టాక్సీ వాలా చేశాడు. అదృష్టవశాత్తూ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. గీతా గోవిందం విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించింది. ఇది అల్లు అరవింద్ అండ్ కో సంస్థలకు అత్యంత లాభదాయకమైన సినిమాల్లో ఒకటి. కాబట్టి ఈ క్రేజీ హీరోతో త్వరలో మూడో సినిమా కోసం జతకట్టడానికి నిర్మాత అరవింద్ ఎదురుచూస్తున్నట్లుగా విజయ్ తాజా చిత్రం 'వరల్డ్ ఫెమస్ లవర్' విడుదల కార్యక్రమంలో తెలిపారు. "నేను విజయ్ ను ఎప్పుడు చేస్తావ్ నాతో మూడో సినిమా అని అడిగితే, ఎప్పుడైనా రెడీ" అని చెప్పాడు. త్వరలో మా కాంబోలో సినిమా చూస్తారని అల్లు అరవింద్ తెలిపారు.