
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ తెచ్చుకోని ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బజిగా గడుపుతున్నాడు. ఎంత బిజీగా ఉన్నా, తన అభిమానులతో నిత్యం టచ్ లో ఉండేలా చూసుకుంటాడు. అయితే, కేవలం అభిమానులతో టచ్ లో ఉండటమే కాదు, వారికి కష్టం వస్తే అండగా నిలబడుతున్నాడు కూడా. తన అభిమానుల్లో కానీ వాళ్ల ద్వారా వేరే వాళ్లు కష్టంలో ఉన్నారని తెలుసుకున్నా కానీ తను రన్ చేస్తున్న దేవరకొండ ఫౌండేషన్ నుండి కావాల్సిన సహాయం అందేలా చూసుకుంటాడు. తాజాగా అలా సాయం పొందిన ఒక క్రీడాకారుడు గోల్డ్ మెడల్ సాధించాడు. మెదక్ జిల్లాకు చెందిన కిక్ బాక్సర్ గణేష్, ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్ లో పాల్గొనేందుకు డబ్బులు లేక బాధపడుతుంటే....అభిమానుల ద్వారా విషయం తెలుసుకుని దేవరకొండ ఫౌండేషన్ నుండి రూ.25000 చెక్ అందేలా చూసాడు విజయ్ దేవరకొండ. ఆ సహాయంతోనే ఈ నెల 13న జరిగిన పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. విజయ్ అందించిన సహాయం వల్లే ఈరోజు గోల్డ్ మెడల్ సాధించగలిగానని గణేష్ సంతోషం వ్యక్తం చేశాడు.