
యంగ్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ తన కెరియర్ లో వచ్చే ప్రాజెక్టుల్లో కుదిరినన్నిటికీ సంతకం చేయడంలో దిట్ట. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'అర్జున్ రెడ్డి' విడుదలైన తర్వాత విజయ్ దేవరకొండ చేతిలో దాదాపు 3-4 సినిమాలు ఉన్నాయని తెలిసిందే. కానీ బాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ వేగాన్ని తగ్గించినట్లు కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న 'ఫైటర్' యొక్క హిందీ వెర్షన్ను బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే దాని తెలుగు వెర్షన్ను పూరి జగన్నాధ్ మరియు చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువ నటుడు విజయ్ దేవరకొండకు కరణ్ జోహార్ కొన్ని షరతులు పెట్టినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. విజయ్ దేవరకొండ 'ఫైటర్' విడుదలకు ముందు ఏ కొత్త ప్రాజెక్టుకు సంతకం చేయకూడదని ఖరాఖండిగా చెప్పారట. కరణ్ జోహర్, విజయ్ దేవరకొండను 'ఫైటర్' పై మాత్రమే దృష్టి పెట్టాలని కోరినట్లు మరియు ఇంకో సినిమాకు అప్పుడే సైన్ చేయొద్దని కోరినట్లు తెలుస్తోంది.