
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి స్నేహితులు. అయితే సినీ పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయే వంశీ పైడిపల్లి చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనున్నాడు. బ్లాక్ బస్టర్ మూవీ 'మహర్షి' తరువాత, మహేష్ బాబు మరోసారి వంశీ పైడిపల్లితో జతకట్టనున్నట్లు ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు ఈ చిత్రంపై అంచనాలను పెంచేస్కున్నారు. ఆ అంచనాలను నిలబెట్టేందుకు వంశీ పైడిపల్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మహేష్ బాబు నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కోసం వంశీ పైడిపల్లి వైజాగ్‌లోని కొన్ని ప్రదేశాలను వెతికే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ షూట్ సమ్మర్ నుండి ప్రారంభం కానుంది. ఈ ఇద్దరి కాంబోలో గతంలో వచ్చిన 'మహర్షి' సినిమా హిట్ అవ్వడంతో వీరి తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.