
సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క మల్టీప్లెక్స్ బిజినెస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏషియన్ సినిమాస్ వారితో కలిసి ఏఎంబి పేరుతో హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో మల్టీప్లెక్స్ ను నిర్మించారు. ఈమధ్యకాలంలో సినీ స్టార్స్ కేవలం సినిమాలకే అఖితం కాకుండా బిజినెస్సుల్లో కూడా తమ సత్తా చాటుతున్నారు. అయితే తాజాగా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కూడా మహేష్ బాబునే ఫాలో అయిపోతున్నాడు. ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఒక మల్టీప్లెక్స్ నిర్మించనున్నాడు. దీనికి ఏఎంబి లాగానే ఏవిడీ( ఏషియన్ విజయ్ దేవరకొండ) పేరు పెట్టనున్నారు. విజయ్ దేవరకొండ సొంతూరు అయిన మహబూబ్ నగర్ లో ఏవిడీను నిర్మిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, విజయ్ కు ఏవిడీను హైదరాబాద్ తో సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారట.