
ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన హీరోలకు కానీ హీరోయిన్లకు కానీ గుర్తింపు తెచ్చుకోవడం అంత సులువైన విషయమేమీ కాదు. ఎన్నో ఒడిదుడుకులు చూస్తే కానీ ఆ క్రేజ్, ఇమేజ్ దక్కదు. కానీ విజయ్ దేవరకొండకు ఆ క్రేజ్ ఇమేజ్ కాస్త తొందరగానే దక్కాయి. కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ హీరో అయిపోయాడు. ఒకటి, రెండు సినిమాలతో విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. మరి ముఖ్యంగా అర్జున్ రెడ్డి లాంటి ఒక్క సినిమాతో దేశం మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేసాడు. బాలీవుడ్ తారలు సౌత్ హీరోలు, హీరోయిన్ల గురించి ప్రస్తావించడం తక్కువే. కానీ విజయ్ దేవరకొండ గురించి అడగకుండానే ప్రస్తావిస్తున్నారు. అది రౌడి రేంజ్. తాజాగా బీ టౌన్ స్టార్ హీరోయిన్ అలియా భట్ విజయ్ పై తన అభిప్రాయాన్ని చెప్పింది. మీకు నచ్చిన హీరో, హీరోయిన్లు ఎవరు అని ప్రశ్నించగా...హీరోయిన్లలో అనుష్క శర్మ ఎప్పటికీ తన ఫేవరేట్ అని చెప్పిన అలియా.. హీరోలలో విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. దీని బట్టి విజయ్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.