
దిల్ రాజుకు విజయ్ దేవరకొండ గిఫ్ట్ ఇస్తా అనడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అసలు మ్యాటర్ ఏంటంటే...తన రెండవ సినిమా అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ రౌడి ఎం మాట్లాడినా, ఎం పని చేసినా అది సెన్సేషన్ అవుతుంది. రౌడీకి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఎంతోమంది బడా నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూస్తున్న వారిలో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒకరు. విజయ్ దేవరకొండ డేట్స్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తుంటే ఎట్టకేలకు రౌడీ డేట్స్ ఇచ్చేశాడు. నేడు దిల్ రాజు పుట్టినరోజు సందర్భంగా విజయ్ దేవరకొండ దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేసాడు. నిన్ను కోరి, మజిలీ వంటి క్లాసిక్ హిట్స్ ఇచ్చిన శివ నిర్వాణ ఈ చిత్రంకు దర్శకత్వం వహించనున్నారు. ఈ నేపథ్యంలో "హ్యాపీ బర్త్ డే సర్, మీకు త్వరలో బ్లాక్ బస్టర్ గిఫ్ట్ వస్తుందంటూ" విజయ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు.