
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన రొమాంటిక్ అండ్ ఎమోషనల్ డ్రామా 'వరల్డ్ ఫేమస్ లవర్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 29 కోట్లు చేసింది. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం బ్రేక్-ఈవెన్ మార్క్‌ను తాకడానికి రూ. 29 కోట్లు వరల్డ్ వైడ్ షేర్‌ను సాధిస్తే బయర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్లో ఉంటారు. ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం, విజయ్ దేవరకొండ చిత్రం హిట్ కావడానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్ల షేర్ ను సంపాదించాలి. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశిఖన్నా, కాథెరిన్, ఇజాబిల్లే, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లు గా నటించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరల్డ్ ఫేమస్ లవర్, తెలుగు వెర్షన్ యొక్క థియేట్రికల్ హక్కులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో రూ. 20.5 కోట్లకు అమ్ముడయ్యాయి. కర్ణాటక థియేట్రికల్ హక్కులను రూ. 1.30 కోట్లకు విక్రయించారు. ఓవర్సీస్ హక్కులు 3కోట్ల రూపాయలకు, మిగతా ఇండియా మొత్తం రూ. 1.50 కోట్లకు అమ్ముడయ్యాయి. ప్రింట్స్ & పబ్లిసిటీ కోసం రూ. 2.7 కోట్లతో సహా, వరల్డ్ ఫెమస్ లవర్ యొక్క ప్రపంచవ్యాప్త థియేట్రికల్ బిజినెస్ రూ. 29 కోట్లు. ఇప్పుడు విజయ్ కు హిట్ పడాలంటే రూ. 30కోట్లు వసూళ్లను రాబట్టాలి.