
మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ-పూరి 'ఫైటర్'
దర్శకుడు పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామ 'ఫైటర్' షూటింగ్ జనవరి 20న ముంబైలో మొదలుపెట్టారు. ఈ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను ముగించింది. చిత్ర సిబ్బంది నిన్న హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఫైటర్‌లో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడని తెలిసిన విషయమే. విజయ్ థాయ్‌లాండ్‌లోని మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో కొన్ని వారాలపాటు శిక్షణ కూడా పొందాడు. అయితే మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా, బాలీవుడ్ స్టార్ అనన్య పాండే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్, ఛార్మి కౌర్ సంయుక్తంగా ఈ తెలుగు-హిందీ ద్విభాష చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదట ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా అనుకున్నప్పటికి, కొన్నీ కారణాల వల్ల వెనక్కి వెళ్ళింది. దీంతో చిత్ర బృందం అనన్య పాండేను ఎంపిక చేసింది.