
పెళ్లి చూపులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డితో విపరీతమైన క్రేజ్, స్టార్ డమ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండకు క్రిస్టమస్ వస్తే చాలు ఏదోక భిన్నమైన ఐడియాలతో అభిమానులకు మరింత దగ్గరవుతాడు. క్రిస్టమస్ అంటేనే శాంటా తాత..ఆ తాత ఇచ్చే గిఫ్ట్‌ల కోసం ఎదురుచూస్తుంటారు. అందుకే 2017లో అలా క్రిస్టమస్ రోజున విజయ్ దేవరకొండ "దేవర శాంటా" పేరుతో గిఫ్టులుఇవ్వడం మొదలు పెట్టాడు. 2017లో కొంతమంది అభిమానులకు పెర్సనల్ మెసేజ్ రాసి దానితో పాటు గిఫ్ట్ కూడా పంపాడు. గత ఏడాది అందరిని తమ తల్లిదండ్రులకు ప్రేమ చూపిస్తూ ఒక వీడియోను పోస్ట్ చెయ్యమని అందుకు కొన్ని సెలెక్ట్ చేసి వాళ్లకు గిఫ్ట్‌లు పంపాడు. ఇక ఈ ఏడాది స్వయంగా తానే రంగంలోకి దిగి..."మీకు ఎం కావాలో మీరే చెప్పండి. వాటిల్లో కొన్ని నేను నెరవేరుస్తానని" సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అంతే కుప్పలు కుప్పలుగా మెసేజస్ వచ్చాయి. వాటిలో కొన్ని దేవర శాంటా ముందోకొచ్చి నెరవేర్చాడు.