
మీడియా మరియు చలన చిత్ర పరిశ్రమలో సాగుతున్న ప్రచారం మేరకు, బాలీవుడ్ నిర్మాత మరియు పంపిణీదారు కరణ్ జోహార్ యంగ్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండతో ఒక ఆసక్తికరమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. కరణ్ జోహార్, విజయ్ దేవరకొండకు సంవత్సరానికి రూ. 100 కోట్ల రూపాయలకు ఇస్తానని చెప్పినట్లు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అర్జున్ రెడ్డి స్టార్, కరణ్ జోహార్ ఏ చిత్రాలకు సంతకం చేయమంటే ఆ చిత్రాలకు సంతకం చేయాలనదే డీల్. కరణ్, విజయ్ ను నేషనల్ స్టార్ గా మారుస్తానని హామీ చేసినట్లు నివేదికలు వస్తున్నాయి. మరి ఈ డీల్ విజయ్ కు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం ఛార్మి, పూరి, బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'ఫైటర్' సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.