
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, నలుగురు హీరోయిన్లతో ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన 'వరల్డ్ ఫెమస్ లవర్' మొదటి రోజున మంచి వసూళ్లనే సాధించింది. అయితే రాబోయే రోజుల్లో కొన్ని పోస్ట్-రిలీజ్ ప్రమోషన్లను మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఆ ప్రమోషన్స్ కు విజయ్ దేవరకొండ డుమ్మా కొడుతున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ తన కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభించినందున ఈ ప్రమోషన్లలో పాల్గొనడం లేదు. ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ ఈ రోజు ముంబైలో ప్రారంభమైంది మరియు రాబోయే కొద్ది రోజులు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ఛార్మి, బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'ఫైటర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా, ప్రమోషన్స్ తో ఎప్పుడు తన సినిమాలను ఒక అడుగు ముందుకు తీసుకెళ్లే విజయ్ ఈసారి పాల్గొనకపోవడం గమనార్హం.