
తమిళ స్టార్ విజయ్ సేతుపతి వరుస సినిమాలు సైన్ చేస్తూ వెళ్తున్నారు. నటుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డిలో విజయ్ సేతుపతి అతిధి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోగలిగాడు. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఇప్పుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించబోయే తదుపరి తెలుగు చిత్రంలో విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్ర కోసం తీస్కొబడ్డారని సమాచారం. ఈ చిత్రాన్ని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. #AA20 లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తుండగా, ఫారెస్ట్ ఇన్స్పెక్టర్ పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న #AA20 లో విలేజ్ పిల్ల పాత్రలో రష్మిక మందన్న మేరవనుంది. ఇందులో బహుముఖ నటుడు జగపతి బాబు, కన్నడ నటుడు రాజ్ దీపక్ శెట్టి విలన్ పాత్రలు పోషిస్తున్నారు. #AA20 ఒక మోటైన కథ మరియు రెడ్ సాండర్స్ స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్ ఆధారంగా తెరకెక్కనుంది.