
తన యాక్టింగ్ తో మెగా ఫ్యామిలీ హీరోల మనసు దోచుకున్నారు తమిళ స్టార్ విజయ్ సేతుపతి. 'సైరా నరసింహారెడ్డి' లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన విజయ్ తరువాత వైష్ణవ్ తేజ్ పరిచయం అవుతున్న సినిమా 'ఉప్పెనా'లో కనిపించనున్నారు. అల్లు అర్జున్-సుకుమార్ చిత్రంలో కూడా విజయ్ సేతుపతి మెయిన్ విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు, సరికొత్త సమాచారం ప్రకారం, వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించున్న సినిమాలో మేకర్స్ విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని పరిశీలిస్తున్నారు. అయితే, ఈ ఉహాగానాలకు సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. వరుణ్ తేజ్ బాక్సర్ కు నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు వెంకటేష్ మరియు సిద్ధు ముద్దా దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టిన యూనిట్ 2020 రెండవ భాగంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.