
రేపటి నుంచి మొదలు వరసగా నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. సంక్రాంతి అంటే చాలు సినిమా లవర్స్ ఎదురుచూస్తుంటారు. ఈ సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకుల ఆనందానికి అంతు లేదు. ఇకపోతే మహేష్ బాబు, రష్మీక జంటగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుంది. అయితే లేడీ అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయశాంతి నటించాలని దర్శకుడు అనిల్ రావిపూడి పట్టుబట్టాడు. అందుకోసం ఆమెకు రెమ్యునరేషన్ బాగానే ముట్టినట్లు తెలుస్తోంది. విజయశాంతి రెమ్యునరేషన్ గస్ కోటి యాబై లక్షలు తీసుకుందట. హీరోయిన్ రష్మీక రెమ్యునరేషన్ అంతకన్నా తక్కువేనట. అనిల్ రావిపూడి పట్టుబట్టి మరి, భారీ పారితోషకంతో విజయశాంతిని ఒప్పించారని తెలుస్తోంది.