
ప్రతి సినిమాలో కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు విక్రమ్ కె కుమార్. 2009 లో విక్రమ్ తెరకెక్కించిన '13B' అనే హర్రర్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇది తెలుగులో పదమూడు పేరుతో డబ్ చేయబడింది. ఆ తర్వాత ఈ మనం చిత్ర డైరెక్టర్ హర్రర్ సినిమా వైపు వెళ్ళలేదు. అయితే, చాలా కాలానికి మళ్ళీ హర్రర్ జానర్లో తీయడానికి విక్రమ్ సిద్ధం అయ్యినట్లు తెలుస్తుంది. అయితే ఇది సినిమానా లేక ఏదైనా ఓటిటిలో రాబోతున్న వెబ్ సిరీస్ అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క, సూర్య హీరోగా తెరకెక్కిన 24కు సిక్వెల్ కోసం కథను రాసే పనిలో పడ్డాడు. ఈ సిక్వెల్ దిల్ రాజు నిర్మాణంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనుంది.