
బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటి, ఫిదా ఫేమ్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'విరాట పర్వం' పై మంచి అంచనాలే నెలకొన్నాయి. విరాట పర్వం యొక్క ప్రమోషన్స్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం నక్సలైట్ల కథతో రూపొందుతుంది మరియు ఇందులో కీలక పాత్రల్లో నదితా దాస్, ప్రియమణి కూడా ఉన్నారు. నేడు రానా దగ్గుబాటి ’పుట్టినరోజు సందర్భంగా విరాట పర్వం మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. విరాట పర్వం ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే రానా దగ్గుబాటి రవి అన్న పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. పోస్టర్లో రానా దగ్గుబాటి తన బృందంతో పాటు తుపాకులను మోసుకెళ్తూ అడవిలో నడుస్తున్నట్లు కనిపిస్తుంది. రానా ఆలివ్ గ్రీన్ యూనిఫాం ధరించాడు. మొత్తానికి పోస్టర్ ఎంతో డైనమిక్ గా మరియు అంచనాలను రేటింపు చేసే విధంగానే ఉంది.